ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరగనున్న కుంభమేళాపై జాతీయ కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పాపాలు పొగొట్టుకునేందుకు చాలా మంది కుంభమేళాకు వెళ్తారని వ్యాఖ్యానించారు. కుంభమేళాకు వెళ్లే వారిలో రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు, వాణిజ్య రంగాలకు చెందిన వారు ఉంటారు. ఇలా వారందరి మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం కాంగ్రెస్ నేత చేశారని బీజేపీ ఫైర్ అవుతోంది.
ఉదిత్ రాజ్ మాట్లాడుతూ.. పాపాలు కడుక్కోవడానికే హిందువులు కుంభమేళాకు వెళ్తారు. వారి కోరికలు స్వార్థమైనవని అనడంతో ఆయనపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కొన్ని రోజుల కిందట ఎంఐఎం, ఇప్పుడు కాంగ్రెస్ కుంభమేళాను అవమానించాయని కాషాయ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఆయన మీద చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.