ఖాళీగా ఉండే వారిలో కొందరికి చాలా మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. తాజాగా ఒక యువకుడు బండి తయారు చేసాడు. 10 వ తరగతి చదివే చిన్నారి లాక్ డౌన్ లో ఖాళీ గా ఉండలేక ఏకంగా బైక్ తయారు చేసుకుని సంచలనం సృష్టించాడు. కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగడ్ లో 10 వ తరగతి విద్యార్థి గౌరవ్ స్క్రాప్ మెటీరియల్ ఉపయోగించి మోటారు సైకిల్ తయారు చేశాడు.
ఈ సందర్భంగా అతను మీడియాకు వివరించాడు కూడా. “నేను 3 సంవత్సరాల క్రితం స్క్రాప్ మెటీరియల్ ఉపయోగించి ఎలక్ట్రిక్ బైక్ తయారు చేసాను. కానీ అది స్పీడ్ గా వేల్లకపోవడంతో నేను ఇప్పుడు పెట్రోల్ మోటారు సైకిల్ గా మార్చాను, అది లీటరు 80 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని వివరించాడు. ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.