రూ.12 లక్షల వరకు 0% టాక్స్ వెనుక చాలా మతలబ్ ఉందని విశ్లేషకులు అంటున్నారు. రూ.4 లక్షల వరకే 0% టాక్స్ ఉంటుందని చెబుతున్నారు ప్రొఫెసర్ జానయ్య.. ఆ తర్వాత 8 లక్షలు సేవింగ్స్ చేసుకొని చూపిస్తేనే దానిపై 0% టాక్స్ ఉంటుందని….అది చూపించకుంటే దానికి టాక్స్ కట్టాలని ఓ ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ జానయ్య వెల్లడించారు. మధ్య తరగతి ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ఇచ్చారు నిర్మలా సీతారామన్.

రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించారు నిర్మలా సీతారామన్. రూ.12 లక్షల ఆదాయం ఉన్నవారికి పన్ను రూపంలో రూ.80 వేలు ఆదా అవుతుంది. ఇతర పన్ను శ్లాబ్స్‌లో కూడా మార్పులు చేయనున్నారు. దీంతో మధ్య తరగతి ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ దక్కింది. అయితే.. రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటన రావడంపై భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి. రూ.4 లక్షల వరకే 0% టాక్స్ ఉంటుందని…8 లక్షలు సేవింగ్స్ చేసుకొని చూపిస్తేనే దానిపై 0% టాక్స్ ఉంటుందని చెబుతున్నారు.
రూ.12 లక్షల వరకు 0% టాక్స్ వెనుక చాలా మతలబ్ ఉంది
రూ.4 లక్షల వరకే 0% టాక్స్.. ఆ తర్వాత 8 లక్షలు సేవింగ్స్ చేసుకొని చూపిస్తేనే దానిపై 0% టాక్స్. చూపించకుంటే దానికి టాక్స్ కట్టాలి – ప్రొఫెసర్ జానయ్య
Video Credits – Tv9 pic.twitter.com/yvww0H7Mid
— Telugu Scribe (@TeluguScribe) February 1, 2025