కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు లోక్‌సభలో 2025-26 ఏడాదికి గాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.అంతకుముందు కేంద్ర బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం లభించింది. అనంతరం పార్లమెంటుకు వచ్చిన నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు.
ఒక్కోరంగానికి ఎంత కేటాయింపులు అనే విషయాన్ని ఆమె చదివి వినిపించారు. ముఖ్యంగా ఈసారి వేతన జీవులకు ఎట్టకేలకే నిర్మలమ్మ శుభవార్త చెప్పారు. దీనికి తోడు మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తిని పెంచేలా బడ్జెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు రంగాలకు రుణ పరిమితిని పెంచడం,కస్టమ్ డ్యూటీని తగ్గించడం వంటివి చేశారు. అయితే, ఒక 1 గంటా 15 నిమిషాల పాటు నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం కొనసాగింది. విపక్షాలు బడ్జెట్ ప్రసంగం టైంలో వాకౌట్ చేయగా.. ప్రసంగం పూర్తయ్యాక లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పార్లమెంట్‌ను సోమవారానికి వాయిదా వేశారు.