దేశభక్తులను అవమానించినవారు క్షమాపణలు చెప్పాల్సిందే – ప్రధాని మోదీ

-

శుక్రవారం మహారాష్ట్రలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ పాల్ఘర్ లోని వద్వాన్ పోర్టుకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం దాదాపు రూ. 76 వేల కోట్లు. అలాగే 1560 కోట్ల విలువైన 218 ఫిషరీస్ ప్రాజెక్టులకు కూడా ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. కొంతమంది వ్యక్తులు దేశభక్తులను అవమానించే విధంగా మాట్లాడుతున్నారని.. దేశభక్తులను అవమానించిన వారు క్షమాపణలు చెప్పాల్సిందేనని అన్నారు.

ఇక ఫిన్ టెక్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గత పది సంవత్సరాల లో ఈ రంగంలో 31 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు వచ్చినట్లు తెలిపారు. ఈ రంగంలోనే స్టార్ట్ అప్ లు 500% వృద్ధిరేటు సాధించాయని.. చిప్ డేటా, మొబైల్లు, జన్ధన్ ఖాతాలు అద్భుతాలు సృష్టించాయన్నారు మోదీ.

ముద్ర రుణాల ద్వారా రూ. 27 లక్షల కోట్లను విడుదల చేశామని తెలిపారు. అందులో 70% లబ్ధిదారులు మహిళలే ఉన్నారని తెలిపారు. బ్రాడ్బ్యాండ్ యూజర్లు 6 నుంచి 94 కోట్లకు పెరిగారని.. ప్రపంచమంత వాడే ప్రాజెక్టులు రూపొందిస్తున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version