కువైట్ అగ్నిప్రమాదంలో చనిపోయినవారిలో ముగ్గురు ఏపీ వాసులు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. కువైట్ అగ్నిప్రమాదంలో చనిపోయినవారిలో ముగ్గురు ఏపీవాసులను ఇండియన్ ఎయిర్ఫోర్స్ విమానంలో మృతదేహాలను తరలి0చారు. కాసేపట్లో కొచ్చి ఎయిర్పోర్టుకు చేరుకోనుంది విమానం.. మృతుల్లో శ్రీకాకుళం జిల్లా సోంపేటకు చెందిన లోకనాథం, ప.గో జిల్లా అన్నదేవరపాడుకు చెందిన ఈశ్వరుడు, ప.గో జిల్లా ఖండవల్లికి చెందిన మెల్లోటి సత్యనారాయణ ఉన్నారు.
కువైట్‌లో భారతీయ కార్మికులు నివాసముండే అపార్ట్‌మెంట్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం జరగడంతో 49 మంది మరణించిన విషయం తెలిసిందే. మృతుల్లో 42 మంది భారతీయులే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాత్రి సమీక్ష నిర్వహించారు. ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు.