ఇవాళ 53వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం..ఆర్థిక మంత్రులకు పిలుపు

-

ఇవాళ 53వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం కానుంది. ఈ తరుణంలోనే… నేడు ఢిల్లీలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశం కానున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అంతేకాదు.. రెండు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఇక ఈ రెండు సమావేశాలకు హాజరుకానున్నారు తెలుగు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు మల్లు భట్టి విక్రమార్క ,పయ్యావుల కేశవ్. ఇవాళ ఉదయం 10 గంటలకు ఆర్థిక మంత్రులతో ముందస్తు బడ్జెట్ సన్నాహక సమావేశం ఉంటుంది.

Today is the 53rd GST Council meeting

బడ్జెట్ రూప కల్పనపై రాష్ట్రాల ఆర్ధిక మంత్రులతో సంప్రదింపులు జరపనున్నారు నిర్మల సీతారామన్. రాష్ట్రాల ఆర్ధిక మంత్రుల నుంచి వార్షిక బడ్జెట్ పై సలహాలు సూచనలు తీసుకోనున్న ఆర్ధికమంత్రి నిర్మల సీతారమాన్‌… ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 53వ జిఎస్టి కౌన్సిల్ సమావేశం ఉంటుంది. ఆన్‌లైన్‌ గేమింగ్‌పై పన్ను వేయడంతో పాటు, ఎరువులపై పన్నును తగ్గించాలన్న పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సిఫార్సులపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version