నేడు ప్ర‌ధాని మోడీ హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ప‌ర్య‌ట‌న

-

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ నేడు హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌నలో ప్ర‌ధాని మోడీ రూ. 11,000 కోట్ల విలువైన ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేయ‌నున్నారు. అలాగే ప‌లు జ‌ల విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించ‌నున్నారు. ఈ రోజు ఉద‌యం 11:30 గంట‌ల‌కు హిమాచ‌ల్ ప్ర‌దేశ్ గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్స్ మీట్ సెకండ్ గ్రౌండ్ బ్రేకింగ్ వేడుకలో ప్ర‌ధాని పాల్గొన‌నున్నారు. అలాగే ఈ సమావేశానికి అధ్యక్ష‌త వ‌హించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మం త‌ర్వాత మూడు ద‌శాబ్ధాల నుంచి పెండింగ్ లో ఉన్న రేణుకాజీ డ్యామ్ కు ప్ర‌ధాని మోడీ శంకుస్థాప‌న చేయ‌నున్నారు.

ఈ రేణుకాజీ ప్రాజెక్ట్ ను పూర్తి చేయ‌డానికి ఆరు రాష్ట్రాల‌తో కేంద్రం మాట్లాడి.. శంకుస్థాపన చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ దాదాపు రూ. 7,000 కోట్లతో 40 మెగావాట్లతో నిర్మాణం చేపడుతున్నారు. అలాగే రూ. 1,800 కోట్లతో నిర్మిస్తున్న‌ లుహ్రీ హైడ్రో ప‌వ‌ర్ ప్రాజెక్ట్ కు శంకుస్థాప‌న చేశారు. అనంత‌రం రూ. 680 కోట్ల తో ధౌల‌సిద్ధ జ‌ల విద్యుత్ ప్రాజ‌క్ట్ ను ప్రాజెక్ట్ కు శంకుస్థాప‌న చేస్తారు. అలాగే రూ. 2,080 కోట్ల తో నిర్మించిన న‌వ్రా – కుద్దు జ‌ల విద్యుత్ ప్రాజెక్ట్ ను ప్ర‌ధాని మోడీ ప్రారంభిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version