ఛత్తీస్‌గఢ్‌ లో నక్సల్స్‌ ఘాతుకం.. ఐఈడీ బాంబు పేలుడులో ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి

-

ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్‌ ఘాతుకానికి పాల్పడ్డారు. వారు అమర్చిన ఐఈడీ బాంబు పేలి ఇద్దరు స్పెషల్‌ టాస్క్ ఫోర్స్‌ కానిస్టేబుళ్లు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బీజాపూర్‌ అటవీ ప్రాంతంలో నక్సల్స్‌ బాంబు అమర్చారు. ఆ బాంబు పేలి ఇద్దరు అధికారులు మరణించారు. ఈ ఘటనపై అధికారులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.

మరోవైపు మహారాష్ట్ర గడ్చిరోలిలో పోలీసులతో జరిగిన కాల్పుల్లో 12 మంది నక్సలైట్లు మృతి చెందారు. కాల్పులు జరిపిన ప్రాంతంలో మావోయిస్టుల మృతదేహాలతోపాటు 3 ఏకే47 సహా 7 అడ్వాన్స్డ్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఓ జవాన్ భుజానికి బుల్లెట్ తగిలినట్లు సమాచారం. ప్రస్తుతం జవాన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా, మహారాష్ట్ర గడ్చిరోలిలో బుధవారం మధ్యాహ్నం పోలీసులు- నక్సలైట్ల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. సుమారు 6 గంటల పాటు జరిగిన ఈ కాల్పుల్లో ఇప్పటివరకు 12 మంది మరణించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version