నూడిల్స్ తిని రెండేళ్ల బాలుడు మృతి!

-

తమిళనాడులో విషాద ఘటన చోటు చేసుకుంది. తిరుచ్చి జిల్లా సమయపురానికి చెందిన శేఖర్- మహాలక్ష్మీ దంపతులకు సాయి తరుణ్ అనే రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆ చిన్నారి కొంత కాలంగా వివిధ అలర్జీ సమస్యలతో బాధపడుతున్నాడు. అందుకు తగ్గ చికిత్స పొందుతున్నాడు. అయితే గత శుక్రవారం రాత్రి బాలుడికి తల్లి మహాలక్ష్మి న్యూడిల్స్ వండింది. ముగ్గురూ తిన్నాక మిగిలిన నూడిల్స్ ఫ్రిజ్లో ఉంచింది.

మరుసటి రోజు ఉదయం( శనివారం) అదే నూడిల్స్ ని తరున్ కి అల్పాహారంగా పెట్టింది. అది తిన్నాక ఇంట్లోనే తరుణ్ వాంతులు చేసుకుని స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో వెంటనే చిన్నారిని సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలుడు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.దీంతో చిన్నారి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం శ్రీరంగం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే నిజానిజాలు తెలుస్తాయని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version