ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన’ వ్యాఖ్యలపై స్పందించిన ప్రధాని..!

-

తమిళనాడు మంత్రి, సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదస్పదమయ్యాయి. ముఖ్యంగా బీజేపీ డీఎంకే పార్టీని, ఇండియా కూటమిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ఇండియా కూటమి హిందూ మతాన్ని ద్వేషిస్తోందని, ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు.

మరోవైపు కాంగ్రెస్ తాము అన్ని మతాలను సమానం చూస్తామని ప్రకటించింది. ఇకఇదిలా ఉంటే.. ఉదయనిధి వ్యాక్యలపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించినట్టు తెలుస్తోంది. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు సరైన సమాధానం చెప్పాలన్నారు. న్యూఢిల్లీలో జీ-20 సదస్సుకు ముందు జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చరిత్రలోకి వెళ్లవద్దు, కానీ రాజ్యాంగం ప్రకారం.. వాస్తవాలకు కట్టుబడి ఉంటుంది. సమస్య సమకాలిక పరిస్థితుల గురించి మాట్లాడండి అని ప్రధాని పేర్కొన్నారు. ఇండియా వర్సెస్ భారత్ వివాదంపై వ్యాఖ్యానించకూడదని మంత్రులకు ప్రధాని సలహా ఇచ్చారు. తగిన వ్యక్తి  మాత్రమే ఈ విషయంపై మాట్లాడాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news