ముంబై పేరు నాశనం చేయడానికి కంకణం కట్టుకుంది !

సుశాంత్ ఆత్మహత్య కేసుతో మొదలయిన కంగనాకు, మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం ఇంకా కొన సాగుతోంది. విద్వేష వ్యాప్తి కారణమయ్యారంటూ కంగనాపై కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా ఆమెకు సమన్లు జారీచేశారు. అయితే తన కుటుంబంలో పెళ్లి వేడుకలు ఉన్నాయని అందుకే తాను ఇంకా కొన్నాళ్ళు హిమాచల్ ప్రదేశ్ లోనే ఉంటానని ఆమె అన్నారు.

ముంబై రావడానికి మరికొంత సమయం కావాలని కంగనా కోరింది. ఇక మరో పక్క ఏమో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కంగనాను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముంబైని అపఖ్యాతి పాలు చేయడానికి కంగనా కంకణం కట్టుకుందని ఆరోపించారు. ఆమెను రావణ్‌ గా అభివర్ణించిన ఆయన గంజాయి పొలాలు మీ రాష్ట్రంలో ఉన్నాయి మదగ్గర కాదని అన్నారు.