పది రోజుల్లోనే ఎంబీఏ.. ఇలా చెప్పేవాళ్లతో జాగ్రత్త : UGC

-

ఆన్‌లైన్‌లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) యువతకు కీలక హెచ్చరిక చేసింది. దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో గుర్తింపుపొం దిన డిగ్రీ ప్రోగ్రాముల మాదిరిగానే ఆన్‌లైన్‌ కోర్సులను అందిస్తామంటూ కొందరు వ్యక్తులు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఓ ప్రకటన విడుదల చేసింది. అలాంటి వాటిలో ‘10 రోజుల ఎంబీఏ’ అనే అంశం తమ దృష్టికి వచ్చినట్లు యూజీసీ కార్యదర్శి మనీష్‌ జోషీ తెలిపారు.

“ప్రాంతీయ, రాష్ట్ర, కేంద్ర చట్టాల ద్వారా ఏర్పాటైన లేదా విలీనమైన విశ్వవిద్యాలయాలు, లేదా పార్లమెంటు చట్టం ద్వారా ప్రత్యేక అధికారం పొందిన సంస్థలకు మాత్రమే డిగ్రీని ప్రదానం చేసే అధికారం ఉంటుంది. ఆన్‌లైన్‌లో డిగ్రీని అందించాలనుకునే ఏ ఉన్నత విద్యా సంస్థ అయినా తప్పకుండా యూజీసీ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇలా అనుమతి పొందిన విద్యాసంస్థలు వాటి కోర్సుల వివరాలను యూజీసీ వెబ్‌సైట్‌ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆన్‌లైన్‌లో కోర్సులకు దరఖాస్తులు చేసుకునే ముందు వాటి చెల్లుబాటును నిర్ధారించుకోవాలి” అని మనీష్ జోషి విద్యార్థులకు సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version