హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ఏసీబీ అధికారులు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులను తాజాగా అదుపులోకి తీసుకున్నారు. గోదావర్తి సత్యనారాయణ మూర్తి (62), పెంట భరత్ కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణి కుమార్(30)ను శివబాలకృష్ణ బినామీలుగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
అక్రమార్జనతో కొనుగోలు చేసే ఆస్తులను శివబాలకృష్ణ వీరి పేరిట రిజిస్టర్ చేయించేవాడని ఏసీబీ అధికారులు తేల్చారు. శివబాలకృష్ణ ఇంట్లో సోదాల సమయంలో వీరి ఇళ్లల్లోనూ సోదాలు చేసినట్లు చెప్పారు. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని..ఈ క్రమంలోనే వారిని తాజాగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మంగళవారం రోజున వీరిని ఏసీబీ కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండు విధించారు. దీంతో వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో ఇప్పటివరకూ ఐదుగురు అరెస్టయ్యారు. శివబాలకృష్ణ, ఆయన సోదరుడు శివనవీన్ అరెస్ట్ కాగా.. బెయిలుపై విడుదలయ్యారు.