బ్యాంకుల్లో పట్టించుకోని సొమ్ము రూ.35వేల కోట్లు.. మీ పేరు ఉందేమో చెక్ చేస్కోండి

-

పొదుపు ఖాతాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్​లలో డబ్బులు దాచి మరచిపోయిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఇలా వివిధ బ్యాంక్​ల్లో మర్చిపోయిన సొమ్ము మొత్తం దాదాపు రూ.35 వేల కోట్ల మేర ఉందని ఆర్‌బీఐ లెక్క తేల్చింది. సుమారు పదేళ్లకు పైగా ఎటువంటి లావాదేవీలను నిర్వహించని ఖాతాల్లో ఉన్న మొత్తం డబ్బు ఇది.

ఈ డబ్బును ఇప్పుడు బ్యాంకులన్నీ కలిపి రిజర్వు బ్యాంకు ఆధ్వర్యంలోని డిపాజిటర్‌ ఎడ్యుకేషన్‌ అవేర్‌నెస్‌ (డీఈఏ) నిధికి బదిలీ చేశాయి. మరి ఈ మొత్తంలో మీ డబ్బూ ఉందా? అలా ఉంటే దాన్ని తీసుకునేందుకు ఏం చేయాలంటే..? క్లెయిమ్​ చేయని మొత్తం సొమ్మును సంబంధిత వ్యక్తులకు అందించాలనే సంకల్పంలో ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోంది. దీని కోసం గైడ్​లైన్స్​ను సిద్ధం చేయాల్సిందిగా ఆర్థిక మంత్రి సూచనలు జారీ చేశారు.

తమ బ్యాంకుల్లో ఎవరి డబ్బైనా ఉందా లేదా అన్న విషయాన్ని ఖాతాదారులు తెలుసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నాయి. పలు బ్యాంకులు ఇప్పటికే ‘అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్‌’లను తెలుసుకునేందుకు ప్రత్యేక ఏర్పాటు చేశాయి. బ్యాంకు వెబ్‌సైటులో ఇందుకోసం ప్రత్యేక లింక్‌ను సైతం ఖాతాదారుల కోసం అందుబాటులోకి ఉంచుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version