అన్‌లాక్ 4.0: మెట్రో సర్వీసులు పునఃప్రారంభం..!

-

కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించింది. సిటీలో ఎక్కడికి వెళ్లాలన్నా సొంత వాహనం ఉంటేనే సాధ్యం అవుతోంది. డబ్బులు పోసి క్యాబులు, ఆటోల్లో ప్రయాణించే స్థితిలో కామన్ మ్యాన్ లేడు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అన్‌లాక్ 4లో మరిన్ని సడలింపులు ఇవ్వాలని భావిస్తోంది. దీని కోసం అన్‌లాక్ 4.0 గైడ్‌లైన్స్‌ను సిద్ధం చేస్తోంది. అన్‌లాక్ 4లో మెట్రో రైళ్లకు అనుమతి ఇవ్వవచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

సెప్టెంబరు 1 నుంచి మెట్రో సర్వీసులను పునరుద్ధరించాలని యోచిస్తోంది. అయితే స్కూళ్లకు మాత్రం అనుమతి ఇవ్వడం లేదని తెలుస్తోంది. కాగా ఇప్పటికే సినిమా షూటింగ్‌లకు కేంద్రం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే బార్లు తెరిచేందుకు కూడా ఇప్పట్లో అనుమతిచ్చే పరిస్థితి లేదు. ప్యాసింజర్ రైళ్ల రాకపోకలపై మరికొన్ని రోజులు నిషేధం తప్పేలా లేదు. ప్రత్యేక రైళ్ల రాకపోకలు కొనసాగుతాయని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version