వైసీపీ నేత వల్లభనేని వంశీ కి మరోసారి షాక్ తగిలింది. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డీటీపీ ఆపరేటర్ సత్యవర్దన్ కిడ్నాప్ కేసులో ఆయనకు చుక్కెదురైంది. వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను విజయవాడ ఎస్సీ, ఎస్టీ, కోర్టు కొట్టేసింది.
వంశీకి బెయిల్ మంజూరు చేస్తే.. సత్యవర్ధన్ కి ప్రాణహాని ఉందని బాధితుడి తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. నిందితుని నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని తెలిపారు. ఇప్పటికే వంశీని రిమాండ్ కు తీసుకున్నందున బెయిల్ మంజూరు చేయాలని అతని తరపు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం వంశీ బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది.