అయోధ్యలో నేటి నుంచి ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన ముందస్తు కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. నేడు ప్రాయశ్చిత్త, కర్మకుటి పూజలు జరగనుండగా రేపు ఆలయ ప్రాంగణంలోకి విగ్రహం ప్రవేశిస్తుంది.
18వ తేదీన తీర్థపూజ, జలయాత్ర, గంధాదివాస్…. ఆ మర్నాడు 19న ఔషధదివాస్, కేసరదివాస్, గ్రితదివాస్, ధాన్యదివాస్ పేరుతో పూజలు ఉంటాయి. 20న షర్కారదివాస్, ఫలదివాస్, పుష్పదివాస్…. 21న మధ్య దివాస్, శయ్యదివాస్ కార్యక్రమాలు జరుగుతాయి.
అయితే అయోధ్యకు వచ్చే భక్తులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా దివ్య ఆయోధ్య కొత్త మొబైల్ యాప్ తీసుకువచ్చింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఈ దివ్య అయోధ్య యాప్ ద్వారా అయోధ్యకు వచ్చే భక్తులు రామ మందిరంతో పాటు ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలు గుర్తించిన పూర్తి సమాచారం తెలుసుకోవచ్చని యూపీ ప్రభుత్వం తెలిపింది.