భారత్ విధిస్తున్న టారిఫ్‌లపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసహనం !

-

భారత్ విధిస్తున్న టారిఫ్‌లపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడారు. అధిక టారిఫ్‌లు వ్యాపార, వాణిజ్యానికి అడ్డంకిగా మారాయన్న ట్రంప్… ఈ క్రమంలో ఇండియాలో వస్తువులు అమ్మడం కష్టతరం అవుతోందని వెల్లడించారు. ‘

US President Trump is impatient with India’s tariffs

ప్రపంచంలో ఎక్కువ టారిఫ్‌లు విధించే దేశం భారత్ అని వ్యాఖ్యానించిన ట్రంప్… ఇండియా ఎంత ఛార్జ్ చేస్తుందో.. మేం కూడా అదే పద్దతి పాటించి, అంతే ఛార్జ్ చేస్తామని ప్రకటన చేశారు. భార‌త్‌కు న‌రేంద్ర‌ మోదీ లాంటి నేత ఉండ‌టం గ‌ర్వ‌కార‌ణమన్న ట్రంప్ .. మోదీ, భారత్‌తో మంచి సాన్నిహిత్యం ఉందని గుర్తు చేసారు. ప్ర‌పంచంలో ఏ దేశానికి లేని విధంగా మాకు ఆయిల్‌, గ్యాస్ లాంటి చమురు వ‌న‌రులు అందుబాటులో ఉన్నాయి.. అవి భారత్ మరింతగా కొనుగోలు చేస్తుందని వ్యాఖ్యానించారు ట్రంప్.

 

Read more RELATED
Recommended to you

Latest news