ఐసీసీ వన్డే వరల్డ్ కప్ చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 10 మ్యాచ్ల వరకు పూర్తయ్యాయి. నిన్న ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో టీమిండియా తలపడి బంపర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది.
ఇక వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య అక్టోబర్ 14వ తేదీన అంటే శనివారం రోజున నరేంద్ర మోడీ స్టేడియంలో కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఓ వందే భారత సహా రెండు ప్రత్యేక రైళ్లను నడపాలని వెస్ట్ రైల్వే నిర్ణయం తీసుకుంది. ఓ రైలు ముంబై నుంచి శుక్రవారం రాత్రి 9:30 గంటలకు బయలుదేరి ఉదయం 5:30 గంటలకు అహ్మదాబాద్ చేరుతుంది. మ్యాచ్ తర్వాతి రోజు ఉదయం నాలుగు గంటలకు ముంబైకి మరో రైళ్లు నడుస్తుంది.