డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం.. పోలీసులను ప్రశ్నించిన విద్యార్థి వీడియో వైరల్

-

డ్రగ్స్ సరఫరా, వినియోగం వల్ల కలిగే దుష్ప్రయోజనాల గురించి హర్యానాలోని సోనిపట్‌లో రాష్ట్ర పోలీసులు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఓ విద్యార్థి పోలీసు అధికారులకే ఛాలెంజ్ విసిరాడు. పేరు కోసమే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నాడు. విద్యాసంస్థల పరిసర ప్రాంతాల్లో గంజాయి సులువుగా దొరుకుతున్నా ఆ విషయం తెలిసీ ఆ ముఠాలను ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారని ప్రశ్నించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘‘సార్‌.. మీరు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ, విశ్వవిద్యాలయాలే అతిపెద్ద డ్రగ్స్‌ సరఫరా కేంద్రాలుగా మారాయి. ప్రస్తుతం ఈ సమావేశంలో నాలుగు యూనివర్శిటీల విద్యార్థులు పాల్గొంటున్నారు. చాక్లెట్ కొన్నంత సులువుగా గంజాయి, డ్రగ్స్ దొరుకుతున్నాయి. విద్యార్థులకు డ్రగ్ డీలర్స్ గురించి తెలుస్తోంది. కానీ, పోలీసులకు వాళ్ల గురించి ఎందుకు తెలియడం లేదు. ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు’’ అని విద్యార్థి ప్రశ్నించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు విద్యార్థి ప్రశ్నించిన తీరును అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version