WORLD CUP 2023 : వరల్డ్‌కప్ బెస్ట్ ఫీల్డర్‌గా కోహ్లీ

-

WORLD CUP 2023 : వరల్డ్‌కప్ బెస్ట్ ఫీల్డర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. వరల్డ్ కప్ 2023 బెస్ట్ ఫీల్డర్ గా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఐసిసి ప్రకటించింది. అన్ని జట్లు మూడు మ్యాచ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఐసీసీ పోటీని నిర్వహించింది.

Virat Kohli rated as having ‘biggest impact in field’ after first three games

కోహ్లీకి 22.30 రేటింగ్ పాయింట్ ఇచ్చి అగ్రస్థానంలో నిలిపింది. కోహ్లీ తర్వాత స్థానాల్లో జో రూట్(21.73), వార్నర్(21.32), కాన్వే(15.54), షాదాబ్ ఖాన్(15.13), మ్యాక్స్వెల్(15), రహమత్ షా(13.77), సాంట్నర్(13.28) ఉన్నారు.

కాగా, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. ఇక ఇప్పటికే మూడు మ్యాచ్ లో విజయం సాధించిన టీమిండియా ఇవాళ బంగ్లాదేశ్ జట్టుపై కూడా గెలవాలని ఆత్రుతగా ఉంది. ఈ మ్యాచ్ లో మొదటి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version