ఎప్పుడైనా తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్సే: కేటీఆర్‌

-

విభజన హామీలపై ఏనాడూ ఎన్డీఏను ప్రశ్నించని రాహుల్‌ గాంధీకి తెలంగాణలో పర్యటించే అర్హత లేదని రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నిన్నైనా.. నేడైనా.. రేపైనా.. తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్సే అని సోషల్ మీడియా ప్లాట్​ఫాం ఎక్స్​ వేదికగా వ్యాఖ్యానించారు. కర్ణాటకలో ప్రజలకిచ్చిన హామీలన్నీ 100 రోజుల్లోనే బొందపెట్టిన పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు. నమ్మి ఓటేసిన కర్ణాటక ప్రజలను నట్టేట ముంచి.. తెలంగాణలో నాటకాలకు తెరతీస్తే కాంగ్రెస్‌ను నమ్మేదెవరని ప్రశ్నించారు. కరప్షన్‌కు కేరాఫ్ కాంగ్రెస్ అని ఆరోపించారు.

“ల్యాండ్ మాఫియాకు కేరాఫ్ మీ పీసీసీ చీఫ్‌. టికెట్ల కోసం రూ.కోట్ల సొమ్ముతోపాటు భూములు రాయించుకుంటున్న వ్యక్తి రేవంత్‌. రిమోట్ పాలన గురించి మీరా మాట్లాడేది? రిమోట్ కంట్రోల్ పాలనకు కేరాఫ్ మీ 10-జన్‌పథ్. మా ప్రభుత్వ రిమోట్ తెలంగాణ ప్రజల చేతిలో పదిలంగా ఉంది. మీ గాంధీభవన్ రిమోటే గాడ్సే చేతిలో మాడి మసైపోతోంది. 3 రోజుల పర్యటన చేసినా.. 300 రోజులు ముక్కు నేలకు రాసినా… తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మరు… ఎప్పటికీ విశ్వసించరు’’ అని కేటీఆర్‌ మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version