దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కి హెచ్చరిక. మోసగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని తాజాగా ఎస్‌బీఐ బ్యాంక్ అంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..
ఈ మధ్య కాలం లో ఫ్రాడ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. వీటి వలన ఎన్నో సమస్యలు వస్తాయి. అందుకని కస్టమర్స్ ని జాగ్రత్తగా ఉండాలని కోరుతోంది స్టేట్ బ్యాంక్. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుందని అంటోంది.
ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యం లో ఎస్‌బీఐ ఈ మేరకు కస్టమర్లకు హెచ్చరిస్తోంది. అలానే కేవైసీ మోసాలు పెరిగిపోతున్నాయని, అందువల్ల కస్టమర్లు అలర్ట్‌గా ఉండాలని కోరింది. ఎక్కువగా కేవైసీ వెరిఫికేషన్ పేరుతో మోసగాళ్లు కస్టమర్లను మోసం చేస్తున్నారని… అలర్ట్ గా ఉండాలని అంది.
బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చినట్లుగానే మోసగాళ్లు కూడా కస్టమర్లు ఎస్ఎంఎస్‌లు పంపి, మోసం చేస్తున్నారని ఎస్‌బీఐ తెలిపింది. అందువల్ల జాగ్రత్తగా ఉండాలని అంటోంది. అలాగే బ్యాంక్ కేవైసీ అప్‌డేట్ కోసం ఎలాంటి లింక్స్ పంపదని పేర్కొంది.
ఇంకా మొబైల్ నెంబర్ సహా ఇతర వివరాలను ఎవ్వరికీ షేర్ చేయవద్దని చెప్పడం జరిగింది. ఎవరైనా మోసగాళ్లు కాల్ చేస్తే 18004253800, 1800112211 నెంబర్లకు తెలియజేయాలని చెప్పింది.