నేడు బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల ఫలితాలు.. కౌంటింగ్ ప్రారంభం

-

పశ్చిమ బెంగాల్​లో ఎట్టకేలకు సోమవారం రోజున పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. భారీ హింసాత్మక ఘటనల మధ్య జరిగిన ఈ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. పటిష్ఠ బందోబస్తు నడుమ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 2024 జనరల్‌ ఎలక్షన్స్‌కు కొన్ని నెలల ముందు పంచాయతీ ఎన్నికలు జరగడంతో అధికార టీఎంసీ, ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.

ఈ క్రమంలోనే ఎన్నికల ఓటింగ్ రోజున బెంగాల్​లో పెద్ద ఎద్దున హింస చెలరేగింది. రాజకీయ ఘర్షణల్లో 40 మందికిపైగా మరణించారు. బ్యాలెట్‌ బాక్సులు ఎత్తుకెళ్లడం, బాలెట్‌ పేపర్లకు నిప్పంటించడం, చెరువుల్లో పడేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6100కుపైగా పోలింగ్‌ బూతుల్లో ఈ నెల 8న పోలింగ్‌ నిర్వహించారు. 80.71 శాతం పోలింగ్‌ నమోదయింది. అయితే పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరుగడంతో 19 జిల్లాల్లోని 696 బూత్‌లలో సోమవారం రీ పోలింగ్‌ జరుగగా 69.85 శాతం మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version