వ్యాక్సిన్‌కి బిల్ గేట్స్‌కీ ఏంటీ సంబంధం?

వైర‌స్.. వ్యాక్సిన్.. ఈ రెండు పేర్లు తెర‌పైకొచ్చిన ప్ర‌తీ సారీ మూడో పేరుగా బిల్ గేట్స్ తెర‌పైకొస్తున్నారు. ఆయ‌న ఓ సాఫ్ట్ వేర్ కంప‌నీ అధినేత‌. మ‌ల్టీ మిలియ‌నీర్. నాట్ ఏ సైంటిస్ట్‌.. హీ ఈజ్ నాట్ ఏ డాక్ట‌ర్ .. బ‌ట్ వైర‌స్ పేరు విన‌గానే ఆయ‌న పేరు ప్ర‌ధ‌మంగా వినిపిస్తోంది. క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని ఓ ఆటాడుకుంటున్న‌ స‌మ‌యంలోనూ బిల్‌గేట్స్ వ్యాక్సిన్ గురించి వ‌చ్చిన చ‌ర్చలో ప్ర‌తీసారీ తెర‌పైకొస్తున్నారు. వ్యాక్సిన్‌ల‌కి ఈ మ‌ల్టీమిలియ‌నీర్ మైక్రో సాఫ్ట్ అధినేత‌కీ వున్న సంబంధం ఏంటి? అన్న‌దే ఇప్పుడు ప్ర‌ధాన చ‌ర్చ‌గా మారింది. క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని నాశ‌నం చేస్తోంది. ప్ర‌పంచం న‌లుమూల‌న వున్న దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల్ని అథ‌పాతాళానికి తొక్కేస్తోంది.

ఎన్నో కోట్ల మంది జీవితాల్ని స‌ర్వ‌నాశ‌నం చేస్తోంది. ఈ వైర‌స్ వ‌ల్ల ఆర్థికంగా చితికిపోయిన చాలా మంది ఇక ఈ జీవితాన్నిఅప్పుల భారంతో కొన‌సాగించ‌లేమ‌ని ఆత్మ హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. ఇదిలా వుంటే మాన‌వాళిని వైర‌స్ నుంచి ర‌క్షించ‌డం కోసం అంటూ వంద‌కు పైగా వ్యాక్సిన్ ల ప్ర‌యోగాలు మొద‌ల‌య్యాయి. వైర‌స్‌కు పుట్టిల్లుగా వున్న చైనా ఇప్ప‌టికే ప్ర‌యోగాల‌ని పూర్తి చేసి వ్యాక్సిన్‌ని అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ర‌ష్యా వ్యాక్సిన్‌ని సిద్ధం చేసినా ఫైన‌ల్ ట‌చ్ కోసం భార‌త్ స‌హాయాన్ని అర్థిస్తోంది. ఇక మ‌న దేశంలోని భార‌త్ బ‌యోటెక్ కోవ్యాక్సిన్ ప్ర‌యోగాలు రెండ‌వ ద‌శ‌కు చేరుకున్నాయి.

గ‌తంలో ఎబోలా తో పాటు డెంగూ, రోటా వైర‌స్‌, సార్స్ వంటి అత్యంత ప్ర‌మాద క‌ర‌మైన వైర‌స్‌ల‌కు వ్యాక్సిన్‌ల త‌యారీలో బిల్ గేట్స్ పేరు ప్ర‌ధానంగా వినిపించింది. తాజాగా క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ విష‌యంలోనూ ఆయ‌నే ముందుంటున్నారు. గ‌తంలో వైర‌స్‌ల‌ని పుట్టిస్తూ వాటికే వ్యాక్సిన్‌ల‌ని ఉత్ప‌త్తి చేస్తున్నార‌ని బిల్‌గేట్స్‌పై విమ‌ర్శ‌లు వినిపించాయి. వాటిని బిల్ గేట్స్ అంతే సీరియ‌స్‌గా ఖండించారు. వేల‌ కోట్ల వ్యాపారం టార్గెట్‌గా ఆయ‌న వ్యాక్సిన్‌ల బాట‌ప‌ట్టార‌ని తాజాగా విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి. మంగ‌ళ‌వారం క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్‌పై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లే ఇందుకు అద్ధం ప‌డుతున్నాయి. వ‌చ్చే ఏడాది త్రైమాసికానికి చాలా వ‌ర‌కు వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వ‌స్తాయ‌ని బిల్ గేట్స్ చెప్ప‌డం ఈ అనుమానాల‌కు బ‌లాన్ని చేకూరుస్తోంది.