డ్రగ్స్ కేసులో ఊహించని ట్విస్ట్.. స్టార్ జోడికి నోటీసులు..!

ప్రస్తుతం డ్రగ్స్ వ్యవహారం అన్ని సినీ పరిశ్రమలకు క్రమక్రమంగా పాకి పోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ డ్రగ్స్ ఉదంతంలో ఎప్పుడు ఎవరి పేరు బయటకు వస్తుందో అని ఎంతో మంది సినీ ప్రముఖులు భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికే శాండిల్ వుడ్ ను ఊపేస్తున్న డ్రగ్స్ కేసులో రోజుకో కొత్త కోణం బయటపడుతుంది. అధికారులు దర్యాప్తులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తూనే ఉంది. ఇప్పటికే ఎంతో మంది నటులు డ్రగ్స్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొని అధికారుల నుంచి నోటీసులు అందుకుని అధికారుల ముందు విచారణకు హాజరైన విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు మరో స్టార్ జోడికి అధికారుల నుంచి డ్రగ్స్ కేసులో నోటీసులు అందాయి. కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ జోడీగా ఎంతగానో పేరు సంపాదించుకున్న దిగంత్, ఐంద్రిత లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. బుధవారం 11 గంటలకు తమ ముందు విచారణకు హాజరు కావాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ స్టార్ జోడీకి డ్రగ్స్ కేసులో నోటీసులు అందడం సంచలన గా మారిపోయింది. దీంతో కన్నడ ఇండస్ట్రీ లో ఎంతో మంది సినీ ప్రముఖులకు కూడా భయం పట్టుకున్నట్టు టాక్ వినిపిస్తోంది.