భారత్‌లో 71.1లక్షల ఖాతాలపై నిషేధం విధించిన వాట్సాప్‌

-

భారత్​లో కొంత మంది యూజర్స్​కు ప్రముఖ ఛాటింగ్ యాప్ వాట్సాప్ షాక్ ఇచ్చింది. దాదాపు 71.1 లక్షల ఖాతాలపై నిషేధం విధించింది. అశ్లీల సమాచారం, నకిలీ వార్తల వ్యాప్తిపై ఫిర్యాదులు అందడంతో ఈ చర్యలకు ఉపక్రమించినట్లు వాట్సాప్ సంస్థ తెలిపింది. ఈ ఫిర్యాదుల మేరకు సెప్టెంబరు నెలలో భారతదేశ వ్యాప్తంగా 71.1 లక్షల వాట్సాప్ ఖాతాలపై నిషేధం విధించినట్లు తెలిపింది. భారత్‌లోని ఐటీ నిబంధనలను అనుసరించి చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

25.7 లక్షల ఖాతాలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని వాట్సాప్ సంస్థ చెప్పింది. వాటి డేటాను విశ్లేషించి ముందస్తు చర్యలు చేపట్టినట్లు .నెలవారీ నివేదికలో పేర్కొంది. సెప్టెంబరు నెలలో యూజర్ల నుంచి 10వేల 4 వందల 42 ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది. వాటిలో స్పామ్‌ ఖాతాలకు సంబంధించిన ఫిర్యాదులు, ఖాతాలపై నిషేధం, ప్రొడక్ట్‌ సపోర్ట్‌ వంటివి ఉన్నట్లు వెల్లడించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఖాతాలు.. అసత్యాలను ప్రచారం చేస్తున్న ఖాతాలను గుర్తించి తొలగించినట్లు వాట్సాప్ సంస్థ ప్రకటించింది. యూజర్లకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా వ్యక్తిగత డేటాకు భంగం కలగకుండా ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో భద్రత కల్పిస్తున్నట్లు పునరుద్ఘాటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version