Wife kills husband: భార్యల చేతిలో భర్తలు మరణిస్తున్న ఘటనలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. చాలామంది భర్తలు వారి భార్యల చేతిలో బలి అవుతున్నారు. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది చిన్న చిన్న విషయాలకి భార్యలు భర్తలను ఈ లోకంలో లేకుండా చేస్తున్నారు. తాజాగా ఢిల్లీకి చెందిన కరణ్ దేవ్ (36)ను భార్య సుస్మిత తన ప్రియుడితో కలిసి అతి కిరాతకంగా చంపింది. కరణ్ కు వరుసకు సోదరుడయ్యే రాహుల్ కు చాలా దగ్గర అయింది సుస్మిత. ఆమె రాహుల్ కోసం తన భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. కరణ్ భోజనం చేసే సమయంలో ఆహారంలో 15 నిద్ర మాత్రలు కలిపింది.

అయినప్పటికీ కరణ్ చనిపోలేదు. దీంతో ఈ విషయాన్ని రాహుల్ కు తెలపగా అతడు కరెంట్ షాక్ ఇవ్వమని చెప్పాడు. సుస్మిత తన భర్తకు కరెంట్ షాక్ ఇవ్వగా కరణ్ మరణించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా అక్కడికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వెంటనే సుస్మిత కరెంట్ షాక్ తో మరణించాడు అని చెప్పే ప్రయత్నం చేయగా ఇన్ స్టా చాట్ ద్వారా అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో కరణ్ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సుస్మిత ఆమె ప్రియుడు రాహుల్ ను అరెస్టు చేశారు.