ప్రైవేట్ డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ పనిచేయాలన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్. ఆరోగ్యాంధ్ర నిర్మాణంలో వైద్యులు భాగస్వామ్యం కావాలంటూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ కోరారు. ప్రైవేట్ ఆసుపత్రులలో పనిచేసే వైద్యులు 15 రోజులకు ఒకసారి ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయాలని పిలుపునిచ్చారు.

దీని ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స తీసుకునే పేదలకు మరింత మెరుగైన వైద్యం అందుతుందని సత్య కుమార్ అన్నారు. ఇటీవల ప్రభుత్వ వైద్యశాలల్లో 8% OP, 17% IP సేవలు పెరగడం అభినందనీయమని, దీనిని మరింత పెంచేందుకు కృషి చేయాలని ఆయన అన్నారు.