UPIకి ఇక డబ్బులు కట్టాల్సిందే ? RBI గవర్నర్ క్లారిటీ

-

యూపీఐ సేవలు శాశ్వతంగా ఉచితమేనని వస్తున్న ప్రచారాలపై ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా క్లారిటీ ఇచ్చారు. తాను గతంలో చెప్పిన ఉద్దేశం అధికారాన్ని కాదని అన్నారు. యూపీఐ చెల్లింపులపై చార్జీలు ఉంటాయని సంజయ్ మల్హోత్రా చెప్పారు. వాటిని ఎవరో ఒకరు తప్పకుండా చెల్లించాల్సిందే ఎవరు చెల్లిస్తారనేది ముఖ్యం కాదని సంజయ్ అన్నారు.

ఇప్పటికీ సబ్సిడీల రూపంలో చార్జీలను ప్రభుత్వమే భరిస్తోంది. యూపీఐ వినియోగాన్ని విస్తరించడమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అని సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. రెపో రేటును యథాతథాంగా ఉంచుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 5.5% కొనసాగుతుందని స్పష్టం చేశారు. 2025 – 26 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు ఆరు శాతానికి పైగా ఉంటుందని ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలియజేశారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో పరిస్థితి సానుకూలంగానే ఉందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news