మే 5న చంద్ర గ్రహణంతో.. ఈ రాశుల వాళ్లకి ఐశ్వర్యం.. మీ రాశీ ఉందేమో చూసేయండి..!

-

జ్యోతిష్య శాస్త్రములో చంద్రగ్రహణానికి, సూర్యగ్రహణానికి ప్రత్యేక సంఘటనలుగా భావించడం జరుగుతుంది ఈ గ్రహణాలు ప్రజల మీద ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ సంవత్సరం తొలి చంద్రగ్రహణం మే 5న ఏర్పడుతోంది. ఉదయం 8:45 నిమిషాలకు ఇది ప్రారంభం కాబోతోంది ఆరవ తేదీ తెల్లవారుజామున 1:00 కి ఇది ముగుస్తుంది. ఈసారి వచ్చే ఈ చంద్రగ్రహణాన్ని పెనుమ్బ్రెల్ చంద్రగ్రహణం అంటారు.

ఈ చంద్రగ్రహణం నాడు కొన్ని రాశుల వారిపై ప్రభావం పడిపోతుందని పండితులు అంటున్నారు ఈ గ్రహణం వలన మూడు రాశుల వాళ్ళకి ప్రయోజనం కలగబోతోంది. వాళ్ళ వద్ద ఐశ్వర్యం ఉంటుందట అలానే సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా ఉండేందుకు అవుతుందని పండితులు అంటున్నారు మరి ఈ చంద్రగ్రహణం నాడు ఏ రాసుల వారిపై ఎలాంటి ప్రభావం పడుతుంది అనేది చూద్దాం.

సింహరాశి:

సింహ రాశి వాళ్ళకి ఈ చంద్రగ్రహణం నుండి ప్రయోజనం కలగనుంది. ఈ సమయంలో కొత్త పనులకు శ్రీకారం చుట్టడం మంచిది కోర్టు కేసుల్లో కూడా ఈ రాశి వాళ్ళు విజయం సాధిస్తారు. మతపరమైన కార్యక్రమాల్లో కూడా సింహరాశి వాళ్లు ముందుంటారు.

మకర రాశి:

ఈ రాశి వాళ్ళపై కూడా చంద్రగ్రహణం చక్కటి ప్రభావాన్ని చూపించనుంది మకర రాశి వారికి చంద్రగ్రహణం శుభసంకేతాలని పంపనుంది వ్యాపారస్తులు కొత్త వ్యాపారం మొదలు పెట్టడం మంచిది. ఇదే సరైన సమయం. అలానే ఉన్నతాధికారుల నుండి సహకారం కూడా మకర రాశి వాళ్ళకి ఈ చంద్రగ్రహణంతో లభిస్తుంది. అలానే ఏదైనా ఆస్తి కానీ వాహనాన్ని కానీ కొనాలి అంటే మంచి సమయం ఇది.

మేష రాశి:

ఈ చంద్రగ్రహణానికి మేష రాశి వాళ్ళకి కూడా చక్కటి ఫలితాలని పొందవచ్చు వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగులు పదోన్నతి పొందుతారు. నిరుద్యోగులకి ఉద్యోగం వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version