విపత్తులతో దేశంలో 1.3 లక్షల మంది మృతి

-

భారత్​లో 1970 నుంచి 2021 మధ్య సంభవించిన 573 ప్రకృతి విపత్తులతో 1,38,377 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) వెల్లడించింది. ఇదే కాలంలో ప్రపంచ వ్యాప్తంగా తలెత్తిన 12 వేల విపత్తుల కారణంగా సుమారు 20 లక్షల మంది చనిపోయారని తెలిపింది. రూ.35 లక్షల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని పేర్కొంది. నాలుగేళ్లకోసారి జరిగే డబ్ల్యూఎంవో సదస్సు ప్రారంభమైన సందర్భంగా ఈ గణాంకాలను ప్రకటించింది.

‘విపరీత వాతావరణ పరిస్థితుల వల్ల 1970-2021 మధ్య కాలంలో ఒక్క అమెరికాలోనే రూ.14 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. 10 మరణాల్లో 9 మరణాలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే నమోదయ్యాయి. ఇలాంటి విపత్తులకు బలహీన సమూహాలే ఎక్కువ నష్టపోతాయని తాజాగా బంగ్లాదేశ్‌, మయన్మార్‌లను వణికించిన మోచా తుపాను నిరూపించింది. మనుషుల మరణాలకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కారణమవుతుండగా. వరదల వల్ల ఎక్కువగా ఆస్తి నష్టం సంభవిస్తోంది’ అని డబ్ల్యూఎంవో సెక్రటరీ జనరల్‌ పెట్టేరీ టాలస్‌ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version