రూ. 2 వేల నోట్లు.. *గులాబీ* రంగే కదా – రాములమ్మ సెటైర్లు

-

రూ. 2 వేల నోట్లు.. *గులాబీ* రంగే కదా అంటూ విజయశాంతి.. సీఎం కేసీఆర్‌ పై సెటైర్లు వేశారు. రిజర్వ్ బ్యాంక్ 2 వేల రూపాయల నోటును చెలామణీ నుంచి ఉపసంహరించుకోవడంతో కొన్ని వర్గాలు మళ్లీ గుండెలు బాదుకోవడం మొదలుపెట్టాయి. 2016లో రూ.500, రూ.1000 నోట్ల రద్దు జరిగినప్పుడే కేవలం తాత్కాలిక సర్దుబాటుగా మాత్రమే రూ.2000 నోటును ప్రవేశపెడుతున్నామని రిజర్వ్ బ్యాంక్ స్పష్టంగా చెప్పిందని తెలిపారు.

ప్రస్తుతం అదీగాక కొద్దో గొప్పో నోట్లు ఉన్నవాళ్లు మార్చుకోవడానికి 4 నెలల సమయం కూడా ఇచ్చింది. అందువల్ల ఈ నిర్ణయంతో సామాన్యులకి కలిగిన నష్టం ఏమీ లేకున్నా… ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు ఆ వర్గాలు వ్యతిరేక ప్రచారానికి దిగాయి. 2016లో నోట్ల రద్దు జరిగినప్పుడు ఎన్ని నోట్లు మురికికాల్వల్లో కనిపించాయో… ఎంత నల్లధనం అగ్నికి ఆహుతైందో చెప్పాల్సిన పని లేదు. ఇతర రాజకీయ పార్టీల్ని దెబ్బకొట్టడానికే ఈ నిర్ణయం జరిగిందని కొందరు అంటున్నరు… అదే నిజమైతే కర్ణాటక ఎన్నికలకి ముందే ఈ నిర్ణయం వెలువడి ఉండేదని వివరించారు.

నిజానికి *గులాబీ* నోటు రద్దుతో గుండెలు బాదుకుంటున్నవాళ్లు ఎవరైనా ఉంటే అది తెలంగాణలోని అధికార *గులాబీ* దళం తప్ప ఇంకెవరూ అయి ఉండరు. రాష్ట్రంలో పెచ్చరిల్లిన అవినీతి, అక్రమార్జన తీరుని గమనిస్తే అధికారగణం దగ్గర తప్ప ఇంకెక్కడా ఈ 2 వేల నోట్ల కుప్పలు భారీగా కనిపించే పరిస్థితి లేదు. అందుకే ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకతా లేకపోయినా *గులాబీ* నేతలు మాత్రం గుబులెక్కి శివాలెత్తిపోతున్నరు. లక్షల కోట్లున్నై కనీసం మీ తాన కేసీఆర్ గారూ… 2 వేల రూపాయల నోట్లు *గులాబీ* రంగే కదా! బీఆరెస్ పేర దేశమంతా తోరణాలు కట్టుకోర్రి, నోట్ల రద్దే లేకుంటే ఈ దోపిడీ నోట్ల పంపిణీ దేశమంతా జరిపించేవారు మీరు, రాజ్‌దీప్ సర్దేశాయ్ అనే జర్నలిస్ట్ బయటకు చెప్పిన నిజాల ప్రకారం అంటూ పోస్ట్ చేశారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version