ప్రపంచం వేగంగా అభివృద్ధి వైపు దూసుకు వెళ్తుంది. ఈ క్రమంలోనే పట్టణీకరణ ప్రజలు మొగ్గు చూపుతున్నారు. మెగా నగరాలు కేవలం జనాభా ఎక్కువ కలిగిన ప్రాంతాలే కాక, అపారమైన ఆర్థిక శక్తిని సంస్కృతిని నియంత్రిస్తున్నాయి. లక్షలాదిమంది నివసించే ఆధునిక పట్టణాలు, మానవ భవిష్యత్తును తీర్చిదిద్దే అద్భుత నగరాలు ఎన్నో వున్నాయి. ముఖ్యంగా జనన రేటు,శరణార్థుల నివాసం, పట్టణ విస్తీకరణ, అంశాలను పరిగణలో తీసుకొని, ప్రపంచ జనాభా సమీక్ష నివేదిక అందించబడింది. మరి 2025 నాటికి ప్రపంచంలో అతిపెద్ద నగరాల వివరాలు తెలుసుకుందాం..
టోక్యో, జపాన్ ..( 37,036,200): టోక్యో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నగరం. ఈ నగరం జపాన్ యొక్క రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక కేంద్రంగా ఉంది. ఇక్కడ రవాణా వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, ఇక్కడి సంస్కృతి టోక్యోను ప్రత్యేకంగా నిలబెట్టాయి.
ఢిల్లీ భారతదేశం..(34,665,600):భారతదేశ రాజధాని నగరం ఢిల్లీ రెండవ స్థానంలో ఉంది.ఇక్కడ గత కొన్ని దశాబ్దాలుగా జనాభా పెరుగుతూ వస్తుంది. ఇది గ్రామీణ ప్రాంతాల నుండి వలసల వలన, నోయిడా, గుర్గావ్ వంటి ప్రాంతాల అభివృద్ధి వలన జనాభా పెరిగింది. ఢిల్లీ రాజకీయ, విద్య, వ్యాపారానికి కేంద్రంగా ఉంది. కానీ ఇక్కడ ఎక్కువగా ఇబ్బంది పెట్టేది కాలుష్యం, ట్రాఫిక్, ఈ రెండు సవాళ్లను ప్రస్తుతం ఢిల్లీ ఎదుర్కొంటోంది.
షాంఘై, చైనా (30,482,100): చైనా ఆర్థిక రాజధాని షాంఘై, చైనా మూడో స్థానంలో ఉంది. ఈ నగరం గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్ గా ప్రసిద్ధి చెందింది అంతేకాక ఆధునిక స్కైలైన్, మౌలిక సదుపాయాలను సమృద్ధిగా కలిగి ఉంది. లోతట్టు ప్రాంతాల నుంచి వలసలు పెరగడం వల్ల ఈ నగర జనాభా పెరిగిపోయింది.
ఢాకా, బంగ్లాదేశ్.. (24,652,900): బంగ్లాదేశ్ రాజధానిఢాకా, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ఒకటిగా ఉంది. గ్రామీణ వలసలు వలన ఇక్కడ ఉన్న గార్మెంట్ ఇండస్ట్రీ నగర జనాభా పెరుగుదలకు ఓ కారణం.
కైరో, ఈజిప్ట్ (23,074,200):ఆఫ్రికాలోని అతిపెద్ద నగరాల్లో కైరో ఐతిహాసిక నీలా నది తీరంలో ఉంది. ఈ నగరం సాంస్కృతిక ఆర్థిక కేంద్రంగా ఉంది కానీ జనాభా వృద్ధి చెంది,రద్దీ పెరిగి కాలుష్యం సమస్య ఎదుర్కొంటోంది.
సావో పాలో, బ్రెజిల్ (22,990,000): దక్షిణ అమెరికాలో అతిపెద్ద నగరంలో సావో పాలో ఒకటి ఆర్థిక మరియు సంస్కృతి కేంద్రంగా ఉంది. ఈ నగరం ట్రాఫిక్ సమస్య ను సవాళ్లు ఎదుర్కొంటోంది
ముంబై భారతదేశం : భారత దేశ ఆర్థిక రాజధాని ముంబై, బాలీవుడ్ సినీ రంగం, ఆర్థిక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది ఈ నగరం అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ఒకటిగా నిలిచింది. ఇక్కడ రవాణా సమస్య, హౌసింగ్ లోటు, జనాభా ఒత్తిడి సమస్యలను ఎదుర్కొంటోంది. మోడ్రన్ లైఫ్ స్టైల్ ఇక్కడ జనాభాను ఆకర్షిస్తుంది.
ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగిన దేశాల్లో భారతీయ నగరాలు ఢిల్లీ, ముంబై చోటు తగ్గించుకున్నాయి.