రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్. అల్పపీడనం కారణము రెండు తెలుగు రాష్ట్రాలలో మూడు రోజులపాటు అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 13వ తేదీన పశ్చిమ అలాగే మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

దీని ప్రభావంతో 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అంటే మూడు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే హైదరాబాద్ సహా జిల్లాలో వానలు దంచి కొడుతున్న సంగతి మన అందరికి తెలిసిందే. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్పపీడనం ప్రభావంతో రేపటి నుంచి 14వ తేదీ వరకు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇక ఇవాళ కోస్తా అలాగే రాయలసీమ ప్రాంతాలలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది.