దిల్లీలో కొలువుదీరనున్న.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నటరాజ విగ్రహం

-

ప్రపంచంలోనే ఎత్తైన నటరాజస్వామి అష్టధాతు (ఎనిమిది లోహాలు) విగ్రహం దిల్లీలో కొలువుదీరనుంది. జీ20 శిఖరాగ్ర సదస్సు జరిగే భవనం ప్రాంగణంలో ఈ 28 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. తమిళనాడులో తయారైన ఈ విగ్రహాన్ని బంగారం, వెండి, సీసం, రాగి, తగరం, పాదరసం, ఇనుము, జింక్ లోహాలతో తయారు చేశారు. 19 టన్నుల బరువుతో ఉన్న ఈ విగ్రహం చూపరులను ఆకట్టుకుంటోంది.

తమిళనాడు తంజావూరు జిల్లాలోని స్వామిమలై ప్రాంతంలో ప్రముఖ శిల్పి దేవసేనాపతి స్థపతి కుమారులు ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. పరమశివుడు నాట్యం చేస్తున్నట్లుగా ఉన్న భంగిమలో ఉన్న ఈ విగ్రహ నిర్మాణం .. కేంద్ర సాంస్కృతిక శాఖ పర్యవేక్షణలో జరిగింది. ఫిబ్రవరి 20న విగ్రహ పనులు ప్రారంభం కాగా.. దీన్ని పూర్తి చేయడానికి ఆరు నెలల సమయం పట్టింది. ఈ నటరాజ విగ్రహాన్ని తయారు చేయడానికి రూ.10 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. నటరాజ లోహ విగ్రహాల్లో ప్రపంచంలోనే ఎత్తైనది ఈ విగ్రహమేనని నిపుణులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version