పని మధ్యలో Y బ్రేక్‌.. భారత ప్రభుత్వ కొత్త ఆలోచన..! ఇంతకీ ఏంటిది..?

-

ఆఫీస్‌ వర్క్‌ అంటే ఎంత చేసినా అవ్వదు. మనకు నీరసం వచ్చి పడిపోవాలే కానీ అది మాత్రం ఒక పట్టాన అవ్వదు. కొన్నిసార్లు అయితే ఆఫీస్‌లో ఉన్నా, ఇంట్లో ఉన్నా వర్క్‌ చేస్తుంటే టైమే తెలియదు. గంటలు అలా గడిచిపోతాయి. తినే టైమ్‌ కూడా ఉండదు. అలా గంటల తరబడి కుర్చోని చేస్తూనే ఉంటాం. ఇలా చేయడం వల్ల బ్యాక్‌ పెయిన్‌, నీ పెయిన్‌, ఆ పెయిన్‌, ఈ పెయిన్‌ అనీ అన్నీ వస్తాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆఫీస్‌ ఛైర్‌లోనే కుర్చోగల కొన్ని ఆసనాలు చేయమంటుంది. యోగా ఎట్ ఆఫీస్. ఆఫీసులో యోగా చేయడం. పని మధ్యలో Y బ్రేక్ తీసుకోవాలని నిపుణుల సూచిస్తున్నారు.

Y బ్రేక్ అంటే ఏంటి?

గత వారం భారత ప్రభుత్వం పని మధ్యలో Y- బ్రేక్ తీసుకోవాలని సలహా ఇచ్చింది. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ విధానాన్ని మొదలు పెట్టింది. దీంట్లో భాగంగా డెస్క్ ముందే కూర్చుని చేసే చిన్న వ్యాయామాలుంటాయి. దానికి సంబంధించిన వీడియోలు కూడా షేర్ చేసింది. Y అనే అక్షరం వీటిని సూచిస్తుంది.-Yoga at Chair (కుర్చీలో కూర్చుని చేసే యోగా), Yoga for Workaholics(పనిచేసే వాళ్ల కోసం యోగా) and Yoga Break(యోగా విరామం).

యోగాలో ఆసనాలు, ప్రాణాయామాలు, ధ్యానం ఉంటాయి. కుర్చీలో కూర్చునే వీటిని చేయొచ్చు. వాటివల్ల ఒత్తిడి తగ్గి పనిమీద స్పష్టత పెరుగుతుంది. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది.

ప్రాణాయామాలు

ప్రాణాయామాల వల్ల శరీరం, మెదడు మధ్య సమతుల్యత ఉంటుంది. ఒత్తిడి తగ్గి శక్తివంతంగా ఉంటాం. ఆఫీసులోనే సులభంగా చేసుకోగల కొన్ని ప్రాణాయామాలున్నాయి. 1. శ్వాస మీద ధ్యాస ఉంచుతూ, శ్వాస పీలుస్తూ వదలడం. 2. ఒక నాసికా రంధ్రం నుంచి శ్వాస తీసుకుని, మరో నాసికా రంధ్రం నుంచి వదలడం 3. ముక్కు ద్వారా శ్వాస తీసుకుని రెండంకెలు లెక్కపెట్టే దాకా శ్వాస ఆపి, ఇపుడు నోటి ద్వారా మెల్లగా గాలి వదలాలి.

ఆఫీస్‌ ఛైర్‌లోనే కుర్చోని చేసే ఆసనాలు..

చెయిర్ ట్విస్ట్ (Chair twist): కుర్చీ వెనక భాగాన్ని పట్టుకుని కుడికీ, ఎడమకు శరీరాని వీలైనంతగా సాగదీస్తూ తిరగాలి. దీనివల్ల వెన్ను నొప్పి తగ్గుతుంది.

ముందుగు వంగడం (Forward Fold): కుర్చీలో కూర్చుని ముందుగు వంగడం వల్ల శరీర స్థితి నిటారుగా ఉంటుంది. బలంగా మారతారు.

గోముఖాసనం (Gomukh arms): గోముఖాసనం వల్ల వెన్ను, చేతులు, భుజాలలో నొప్పి నుంచి ఉపశమనం పొందేలా సహాయపడుతుంది

ప్రార్థనా స్థితి (Prayer Twist): దీనివల్ల చాతీకి వ్యాయామం జరుగుతుంది, భుజాల కండరాలకు కూడా ఉపశమనం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version