ఎఫైర్ పెట్టుకోవాల్సిన ఏజ్‌లో కరెంట్ ఎఫైర్స్ చదువుతున్నా.. డిప్యూటీ సీఎంకు యువతి లేఖ

-

‘ఎఫైర్​ పెట్టుకోవాల్సిన వయసులో కరెంట్​ ఎఫైర్స్​ చదువుతున్నాను. ఉద్యోగం రాని కారణంగా ప్రేమించిన వ్యక్తికి నా మనసులోని మాటను చెప్పలేకపోతున్నాను.’ అంటూ ఓ యువతి బిహార్​ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్​కు లెటర్ రాసింది. “మీరు ప్రేమ వివాహం చేసుకున్నారు.. కానీ నిరుద్యోగం నా పెళ్లికి అడ్డంకిగా మారింది” అంటూ ఆ లేఖలో తన గోడు వెల్లబోసుకుంది. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

పింకీ అనే యువతి పేరిట ఈ లేఖ వచ్చింది. నాలుగు సంవత్సరాలుగా తాను ప్రభాత్​ అనే రచయితను ప్రేమిస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొంది. అతడిని వన్​సైడ్​ లవ్​ చేస్తున్నట్లు వెల్లడించింది. ఉద్యోగం వస్తే ప్రేమ విషయాన్ని చెప్పాలకున్నట్లు ఆ యువతి తెలిపింది. అయితే ఉద్యోగం రానందువల్ల తన ప్రేమ విషయాన్ని చెప్పలేకపోతున్నానంటూ వాపోయింది. ఒక్కసారి కూడా ఉద్యోగాలకు నోటిఫికేషన్​ వెలువడలేదని.. ఒకవేళ ​వచ్చినా పేపర్ లీక్​ అవుతోందని అసహనం వ్యక్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version