కేంద్ర ప్రభుత్వం అనుసిరిస్తున్న కార్మిక,కర్షక వ్యతిరేక విధాలను వ్యతిరేకిస్తూ ఇవాళ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి కార్మిక,రైతు సంఘాలు..దాదాపు 16 డిమాండ్లతో తొమ్మిది జాతీయ కార్మిక సంఘాలతోపాటు బీమా, బ్యాంకు, రక్షణ, ఫార్మా, పీఎస్యూ, కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు సమ్మెకు చేస్తున్నాయి..ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని, కార్మికులకు ఉద్యోగ, ఆరోగ్య, జీవిత భద్రత కల్పించాలని, పనిగంటల పెంపును ఆపి, కనీస వేతనం పెంచాలని కార్మికులు, ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు..16 డిమాండ్లతో తొమ్మిది జాతీయ కార్మిక సంఘాలతోపాటు కేంద్ర, రాష్ర్టాల ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఏకమై సమ్మె చేస్తున్నాయి. కేంద్రం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ ఇవాళ సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చారు కార్మిక సంఘాలు..కార్మికులు, ఉద్యోగులతో పాటు రైతులు కూడా సమ్మెలో పాల్గొనేందుకు ఏకమై కదం తొక్కనున్నారు..గల్లీ నుంచి ఢిల్లీ దాకా నిరసనలు, సభలకు కార్మిక సంఘాలు సమాయత్తమయ్యాయి..కేంద్రం తీసుకొస్తున్న చట్టాలు కొద్దిమంది కార్పొరేట్లకు సంపదను దోచిపెట్టేందుకు అనుకూలంగా ఉన్నాయని కార్మికలోకం మండిపడుతోంది.
దేశవ్యాప్త కార్మిక సంఘాల సమ్మె..ప్రభుత్వం ముందు 16 డిమాండ్లు.
-