ఫ్యాటీ లివర్‌కి నేచురల్ సొల్యూషన్.. తేనెలో ఉసిరికాయల శక్తి!

-

శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి. అయితే నేటి జీవనశైలి కారణంగా చాలామంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యను తగ్గించుకోవడానికి మందుల కంటే, ప్రకృతి సిద్ధమైన పరిష్కారాలు ఉత్తమం. మన పూర్వీకులు ఆయుర్వేదంలో ఉపయోగించిన అద్భుతమైన కలయిక ఒకటుంది అదే తేనె మరియు ఉసిరికాయ. ఈ రెండింటిని కలిపి తీసుకుంటే ఫ్యాటీ లివర్ సమస్యకు ఎలా చెక్ పెట్టవచ్చో తెలుసుకుందాం.

ఫ్యాటీ లివర్ అనేది కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వలన వస్తుంది. దీనికి కారణాలు స్థూలకాయం, అధిక మద్యం సేవించడం లేదా సరైన ఆహారం తీసుకోకపోవడం. ఈ సమస్యకు తేనె మరియు ఉసిరికాయల మిశ్రమం ఒక అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. ఉసిరికాయలో విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు కాలేయంలోని విషపదార్థాలను తొలగించి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.

Natural Cure for Fatty Liver – Power of Amla and Honey!
Natural Cure for Fatty Liver – Power of Amla and Honey!

ఉసిరిలో ఉండే ఫైటోకెమికల్స్  కాలేయ కణాలను రక్షించడానికి మరియు పునరుద్ధరించడానికి సహాయపడతాయి. ఇక తేనె, కాలేయానికి అవసరమైన గ్లూకోజ్‌ను సరఫరా చేస్తుంది మరియు ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ప్రతిరోజూ ఉదయం పరగడుపున ఒక చెంచా ఉసిరి రసాన్ని లేదా ఉసిరి పొడిని ఒక చెంచా తేనెతో కలిపి తీసుకోవడం వలన కాలేయంలో పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరుగుతుంది.

అలాగే ఈ మిశ్రమం జీవక్రియ ను మెరుగుపరచి, బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఫ్యాటీ లివర్ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు మరియు కాలేయం చురుగ్గా పనిచేయడానికి తోడ్పడుతుంది.

గమనిక: ఉసిరి-తేనె మిశ్రమం అనేది ఒక సహజమైన చిట్కా మాత్రమే. మీకు ఫ్యాటీ లివర్ ఉన్నట్లు నిర్ధారణ అయితే మీరు తప్పనిసరిగా వైద్యుడిని లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించి వారి సలహా మేరకు మాత్రమే ఆహారంలో మార్పులు చేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news