కష్టపడ్డా అనుష్క పక్కన హీరోగా చేసినా… : నవీన్ పోలిశెట్టి

-

తాజాగా సీఎంఆర్ కాలేజీ లో ఒక ప్రోగ్రాం కు హాజరైన యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తనదైన సహజమైన డైలాగులతో స్టూడెంట్స్ ను హోరెత్తించాడు. తెలంగాణ రాజకీయ నాయకుడు మరియు ప్రస్తుతం మంత్రిగా ఉన్న మల్లారెడ్డి ఎలాంటి ధోరణిలో మాట్లాడుతారో.. ఆ విధంగా హీరో నవీన్ పోలిశెట్టి మాట్లాడి స్టూడెంట్స్ లో హుషారు తెప్పించాడు. ఈ ప్రోగ్రాం లో మాట్లాడిన నవీన్.. సినిమాలలోకి రావడానికి ముందు నేను ఎంతో కష్టపడ్డా… నేను ఏమైనా మాయ మంత్రం చేసిననా… కష్టపడ్డా స్క్రిప్టులు రాసినా.. యూట్యూబ్ లో వీడియోలో తీసినా.. టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ దక్కిన్చుకున్నా , హీరోగా హిట్లు ఊరకనే వచ్చినయా.. కష్టపడ్డా నాకిచ్చిన పాత్రలో నేను పరకాయ ప్రవేశం చేసినా అందుకే ఈ స్థాయిలో ఉన్నాను అన్నాడు. ఇక తాను తాజాగా నటిస్తున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా గురించి కూడా ఒక డైలాగ్ వేసిండు.

కష్టపడ్డా అనుష్క లాంటి హీరోయిన్ పక్కన హీరోగా సినిమా చేసినా .. చివరగా ఇంజనీరింగ్ చేస్తున్నాను అని చెప్పి అమ్మానాన్నల చెవుల్లో పూలు పెట్టినా అంటూ తన నవ్వుల డైలాగులకు ఎండ్ కార్డు వేశాడు నవీన్ పోలిశెట్టి.

Read more RELATED
Recommended to you

Exit mobile version