ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వచ్చిన స్టార్టింగ్ లో విశాఖ పట్టణంలో అనేక కేసులు బయటపడ్డాయి. దీంతో చాలావరకు విశాఖపట్టణం పని అయిపోయినట్లే అని అందరూ భావించారు. కాని అనూహ్యరీతిలో ప్రభుత్వం మరియు పోలీసులు గట్టి చర్యలు చేపట్టి చాలావరకు పరిస్థితిని అధిగమించగలిగారు. కంటైన్మెంట్ ఏరియాల్లో డ్రోన్ల ద్వారా నిఘా పెట్టి పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితిని అదుపులోకి తీసుకు రాగలిగారు. ఓ పక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా విశాఖపట్నం కి ప్రత్యేకమైన అధికారులను నియమించారు.
ప్రజలను మరింత అప్రమత్తం చేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు రంగంలోకి దిగడంతో, ప్రస్తుతం విశాఖపట్టణంలో ప్రజలు బయటకు రావటానికి తెగ భయపడిపోతున్నారు. కోవిడ్ నియంత్రణ విధుల్లో భాగంగా నేవీ రంగంలోకి దిగిన తర్వాత … విశాఖపట్టణంలో చాలా వరకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఓ పక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా విశాఖపట్నం కి ప్రత్యేకమైన అధికారులను నియమించారు. కరోనా వైరస్ కట్టడి చేయడంలో ఎప్పటికప్పుడు పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులను ఆ ప్రాంతంలోనే ఉంచారు.