కరోనా వైరస్ వల్ల చాలా రంగాలు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయాయి. వాటిలో ఒకటి సినిమారంగం. కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా రంగం తీవ్రంగా నష్టపోయింది. ఆ వుడ్ ఈ వుడ్ అని లేదు చాలావరకు సినిమా రంగం నష్టపోయింది. ఎక్కువగా ఈ మహమ్మారి గుంపులు గుంపులు గా ఉండే ప్రజల మధ్య వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉండటంతో సినిమా హాల్స్ మొత్తం క్లోజ్ అయిపోయాయి.
ఇటీవల తమిళ రంగంలో సూర్య తన సినిమా డిజిటల్ ద్వారా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది . దెబ్బకి థియేటర్ల యజమానులకు వ్యతిరేకంగా సూర్య వ్యవహరించడంతో… రాష్ట్రంలో ఉన్న థియేటర్ల యజమానులు సూర్య సినిమాలు థియేటర్లోకి రాకుండా అడ్డుకుంటామని స్పష్టం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న థియేటర్ యాజమాన్యాల సంఘం టాలీవుడ్ నిర్మాణ మండలి డిజిటల్ రిలీజ్ చేయకూడదని దానికి ఇండస్ట్రీ స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతున్నారు.