నిన్న కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమిపై ఆ జట్టు కోచ్ రికీ పాంటింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మా జట్టు తొలి అర్ధభాగం ఆట చూసి సిగ్గుపడ్డాను. బౌలర్లు భారీగా రన్స్ ఇచ్చుకున్నారు. 20 ఓవర్లు వేయడానికి 2 గంటల టైమ్ పట్టింది. 2 ఓవర్లు వెనుకబడటంతో చివరి రెండు ఓవర్లను సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లతోనే బౌలింగ్ చేయాల్సి వచ్చింది. మేం చాలా పొరపాట్లు చేశాం. ఇవి ఆమోదయోగ్యం కాదు’ అని రికీ పాంటింగ్ అన్నారు.
కాగా, విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 106 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.కేకేఆర్ సాధించిన 273 పరుగుల లక్ష్యాన్ని చేదించడంలో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు చేతులెత్తేశారు. రిషబ్ పంత్ 55 పరుగులు, స్టాబ్స్ 54 పరుగులు మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ కూడా రాణించలేదు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 17.2 ఓవర్లలో 166 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అటు అంతకుముందు కేకేఆర్ బ్యాటర్లలో సునీల్ నరేన్, రింకు , రస్సెల్ భయంకరమైన బ్యాటింగ్ చేశారు. దీంతో 273 పరుగులు చేసింది కేకేఆర్.