నయనతార సినిమాలకు కష్టాలు.. ఓటీటీ నుండి తొలగింపు..!

-

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు నయనతార మనందరికీ సుపరిచితమే ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. అయితే నయనతార కొత్త ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. చిత్ర నిర్మాణ సంస్థ ఓటీటీ స్ట్రీమింగ్ నుండి తొలగించింది. నయనతార కి చిక్కులు ఎదురయ్యాయి. ఆమె ప్రధాన పాత్ర పోషించిన అన్నపూర్ణని పై తలెత్తిన వివాదాన్ని దృష్టిలో పెట్టుకుని చిత్ర నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ నిర్ణయం తీసుకుంది.

ఓటిటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫారం నుండి దీనిని తొలగించడం జరిగింది నయనతార 75వ సినిమాగా అన్నపూర్ణిని రిలీజ్ అయింది. చెఫ్ గా ఎదగడానికి తన కళలను ఎలా సహకారం చేసుకుంది అనే కథాంశం తో దీన్ని రూపొందించారు థియేటర్లలో మిశ్రమ స్పందనలు వచ్చాయి విడుదల కాగా ఇందులో కొన్ని సన్నివేశాలు మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉన్నాయని విశ్వహిందూ పరిషత్ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మత విశ్వాసాలు దెబ్బతీయాలని ఉద్దేశం లేదని వివరణ ఇచ్చింది తన సినిమా ఎవరైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించమని నయన్ అంది.

Read more RELATED
Recommended to you

Latest news