తెలంగాణ భవన్ లో కలిసిన అమరుడు శ్రీకాంత్ చారీ తల్లి శంకరమ్మ ని కేటీఆర్, హరీష్ రావు కలిశారు. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. అమరుడు శ్రీకాంత్ చారీ తల్లి శంకరమ్మ తెలంగాణ భవన్ లో హరీష్ రావు అలానే కేటీఆర్ ని కలిసి, తన మనువడు జన్మదిన వేడుకలకు హాజరు అవ్వాలని శంకరమ్మ ఆహ్వానించారు. ఆ తరవాత శ్రీకాంత్ చారీ తల్లి శంకరమ్మ తో పాటుగా తెలంగాణ భవన్ లో హరీష్ రావు, కేటీఆర్ భోజనం చేసారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది. అలానే ఫొటోస్ కూడా నెట్టింట తెగ షికార్లు కొడుతున్నాయి.
ఇది ఇలా ఉంటే గిరిజనులకి రిజర్వేషన్లు పెంపుతో పాటు పోడు పట్టాల పంపిణీ సహా ఎన్నో పథకాలను అందించారు అయితే ఆ విషయాన్ని ఆత్మ విమర్శ చేసుకుని ముందుకు వెళ్తామని చెప్పారు. తెలంగాణ భవన్లో గురువారం జరిగిన మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ అనుకోలేదని అందుకే హామీలు ఇచ్చామని అన్నారు. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని నమ్మి గొప్పగా చేసిన నేతలని కూడా ప్రజలు కూడా తిరస్కరించాలని కేటీఆర్ అన్నారు.