నన్ను బలవంతంగా సినిమాల్లోకి తీసుకొచ్చారు…!

-

ఇటు తెలుగులో అటు తమిళంలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న నటి నయనతార. ఎప్పుడో 12 ఏళ్ళ క్రితం సినిమాల్లోకి వచ్చినా సరే ఆమె మాత్రం ఇప్పటికీ తమిళంలో టాప్ హీరోయిన్ గా ఉంది. తెలుగులో సినిమాలను తగ్గించినా తమిళంలో మాత్రం వరుస సినిమాలు చేస్తుంది. అయితే తనకు అసలు సినిమాల మీద ఏ విధంగా కూడా ఆసక్తి లేదని అంటున్నారు నయన్. అసలు సినిమాల్లోకి రావాలని అనుకోలేదు అని చెప్పింది.

నాకు సినిమాలంటే ఇష్టం లేదని ఆమె తాజాగా మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. నటన అంటే ఏకోశానా ఆసక్తి, ఇష్టమూ రెండూ లేవని ఆమె చెప్పుకొచ్చింది. చదువుకుంటూనే మోడలింగ్‌ చేసేదాన్ని అంటూ చెప్పిన నయన్… 2003లో ఓ మలయాళీ సినిమాలో అవకాశమొచ్చిందన్నారు. ముందు చేయననే అన్నా అని… కానీ ఆ సినిమా దర్శకనిర్మాతలు నచ్చచెప్పడంతో ఒక్క సినిమా మాత్రమే చేయాలని నిర్ణయించుకుని ఆ సినిమా చేశాను అని గుర్తు చేసుకుంది.

ఆ సినిమాలో నా నటనకు మంచి ప్రశంసలు దక్కాయని… సినిమా కూడా మంచి వసూళ్ళను రాబట్టిందని చెప్పారు ఆమె. ఆ సంవత్సరంలో దాదాపు ఎనిమిది సినిమాలకు ఓకే చెప్పానని… అప్పటి నుంచి ఇప్పటి వరకూ వరుస సినిమాలు చేస్తూనే ఉన్నానని అన్నారు. మధ్యలో నా వ్యక్తిగత కారణాల వలన సినిమాలకు కొద్దిగా దూరమయ్యాను తప్ప అవకాశాలు లేక మాత్రం కాదని చెప్పింది. ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ కెరీర్‌లో అన్ని రకాల పాత్రలు పోషించాను అంటూ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version