అనంతపురంలో వీరసింహారెడ్డి సినిమా షూటింగ్

-

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేనిల మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వీరసింహారెడ్డి ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇవాల్టి నుండి అనంతపురం షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.

అనంతపురంలోని పెన్నా అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, ఉరవకొండ, పెనుగొండ పోర్ట్ తదితర ప్రదేశాల్లో చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలని చిత్రీకరించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై భారీ ఎత్తున రూపొందుతున్న ఈ చిత్రంలో శృతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. దునియా విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని చిత్రాలకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్ లను అందించిన సంగీత సంచలనం ఎస్.తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version