NBK 108 : బాలయ్య, అనిల్ రావిపూడి మూవీకి ముహూర్తం ఖరారు..ఇక ఫ్యాన్స్‌ కు జాతరే

-

 

వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాలయ్య.. నెక్స్ట్ సినిమా అనిల్ రావిపూడి తో చేస్తున్న సంగతి తెలిసిందే. దాని కోసం అనిల్ రావిపూడి ఎంతో కష్టపడి స్క్రిప్ట్ రెడీ చేసారట. ఇక ఇందులో హీరోయిన్ గా సోనాక్షి సిన్హా ను , మరో ముఖ్య పాత్ర కోసం శ్రీ లీల ను ఎంచుకున్నారట.

అయితే, బాలయ్య కోసం తాను తన జోనర్ అయిన కామిడీ పూర్తిగా వదిలి పెట్టకుండా, ఓ భారీ యాక్షన్ కామెడీ సబ్జెక్ట్ కలిపి రాసినట్లు అనిల్ రావిపూడి ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. వయస్సు లో ఉన్నప్పుడు బాలయ్య మంచి పవర్ ఫుల్ రోల్ లో కనిపిస్తాడట. ఇది ఇలా ఉండగా, ఈ సినిమా నుంచి తాజాగా బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమాకు రేపు ముహుర్తం ఖరారు అయింది. రేపు ఉదయం 9.36 గంటలకు ఈ సినిమా ప్రారంభం కానుంది. ఈ మేరకు ఓ పోస్టర్‌ ద్వారా చిత్ర బృందం పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version